: 101 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారం


మేడిగడ్డ ఆనకట్టను 101 మీటర్ల ఎత్తుతో నిర్మించుకునేందుకు మహారాష్ట్ర సర్కార్ అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మహారాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి గిరీష్ మహాజన్ తో ఈ రోజు సమావేశమయ్యారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై తుది ఒప్పందం ఖరారు చేసుకునే విషయమై వీరు చర్చించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ, వంద మీటర్ల ఎత్తువరకు నీరు నిల్వ ఉంచుకునేలా గేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 148 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహట్టి ఆనకట్టకు ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి రావాలంటూ ఫడ్నవీస్ ను హరీశ్ రావు ఆహ్వానించారు. కాగా, జులై రెండో వారంలో హైదరాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. ఈ సమావేశం గురించి కూడా ఆయన హరీశ్ వద్ద ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News