: రెండు పంటలకు నీరిస్తే టీఆర్ఎస్ లో ప్రచారకర్తగా చేరతాను: కాంగ్రెస్ నేత జానారెడ్డి


తెలంగాణలోని ప్రాజెక్టులు ఒక పంటకు నీరిచ్చేందుకు డిజైన్ చేసినవని, కేసీఆర్ ప్రభుత్వం కనుక రెండు పంటలకు నీరు ఇస్తే తాను టీఆర్ఎస్ లో ప్రచార కార్యకర్తగా పనిచేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్ మాటల గారడీతో పాలన సాగిస్తోందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ జానారెడ్డి సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News