: మల్కాజ్ గిరి నుంచి నిజామాబాద్ కు కొత్త రైలు ప్రారంభం


మల్కాజ్ గిరి నుంచి నిజామాబాద్ వరకు కొత్త ఫాస్ట్ ప్యాసింజర్ రైలును హైదరాబాద్ డివిజన్ దక్షిణ మధ్య రైల్వే సంస్థ ఈరోజు ప్రారంభించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు మల్కాజ్ గిరిలో బయలుదేరి రాత్రి 8 గంటలకు నిజామాబాద్ కు ఈ రైలు చేరుకుంటుంది. మర్నాడు ఉదయం నిజామాబాద్ లో 7.10 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 11 గంటలకు మల్కాజ్ గిరి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో మొత్తం 10 బోగీలున్నాయని, మంగళ, బుధవారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News