: ‘కళానికేతన్’ ఎండీ లీలాకుమార్ అరెస్టు... జ్యుడీషియల్ రిమాండుకి తరలింపు
చేనేత కార్మికులను మోసం చేసిన కేసులో కళానికేతన్ టెక్స్ టైల్స్ ఎండీ వేములూరి లీలాకుమార్ ని ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ వేణుగోపాల్ ఈ వివరాలను తెలిపారు. కర్నూల్ లోని మౌర్య హోటల్ లో ఉన్న ఆయన్ని ఈరోజు అరెస్టు చేశామని, ధర్మవరం కోర్టులో ఆయన్ని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.4,14,71,000 విలువ చేసే పట్టుచీరలను కొనుగోలు చేసిన ఆయన వారికి డబ్బు చెల్లించలేదని, దీంతో, సదరు వ్యాపారులు ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ‘కళానికేతన్’పై ధర్మవరంలో మొత్తం 14 కేసులు నమోదైనట్లు చెప్పారు.