: ఇలాంటి వ్యక్తి పాత్రలో నేనెలా నటించగలను? అనుకునేవాడిని: నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ


బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన తాజా చిత్రం ‘రమణ్ రాఘవ్ 2.0’ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి, తన పాత్ర స్వభావం గురించి నవాజుద్దీన్ మాట్లాడుతూ, ఇందులో తాను ముంబయికి చెందిన సీరియల్ కిల్లర్ రమణ్ రాఘవ్ పాత్ర పోషించానని, అతని జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించామన్నారు. రమణ్ నిజజీవితంలో చేసిన హత్యలను.. తెరపై తాను చేస్తున్నప్పుడు తనను తానే కోల్పోయినట్లు అనిపించేదని, దాంతో ఇలాంటి వ్యక్తి పాత్రలో తానెలా నటించగలనని అనుకుంటూ ఉండేవాడినని చెప్పారు. ఒక సన్నివేశంలో నటిస్తుండగా తాను కళ్లు తిరిగి పడిపోయానని, ఆసుపత్రిలో చేర్చినప్పుడు కూడా రియల్ రమణ్ అన్న మాటలే పలుకుతూ ఉండిపోయానని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News