: ‘వాట్సాప్’ లో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసిన పోలీసు అధికారి సస్పెన్షన్


సామాజిక మాధ్యమం ‘వాట్సాప్’ గ్రూప్ లో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసిన ఒక పోలీసు అధికారి సస్పెండ్ అయ్యాడు. మధ్యప్రదేశ్ లోని నీముచ్ కు చెందిన ఏఎస్పీ మంగీలాల్ నిన్న రాత్రి అశ్లీల ఫొటోలను ‘వాట్సాప్’ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అయితే, ఈ ఫొటోలపై ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇదే గ్రూప్ లో ఎస్పీ మనోజ్ కుమార్ సిన్హా కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ అశ్లీల ఫొటోల పోస్టింగ్ పై సదరు ఏఎస్పీ వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఆ ఫొటోలను డిలీట్ చేయబోయి, పొరపాటున ‘సెండ్’ క్లిక్ చేశానని చెప్పాడు. అయితే, ఈ విషయం అప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో మంగీలాల్ పై సస్పెన్షన్ వేటు పడింది.

  • Loading...

More Telugu News