: తమిళ నటుడు శరత్ కుమార్ కు స్వల్ప గుండెపోటు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
తమిళనటుడు, నటి రాధిక భర్త శరత్ కుమార్, కొద్ది సేపటి క్రితం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు హుటాహుటిన ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా, ఆరోగ్య పరిస్థితిపై వైద్యం చేస్తున్న డాక్టర్లు ఇంకా ఎటువంటి సమాచారాన్నీ మీడియాకు అందించలేదు. కాగా, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చినట్టు అనిపించిందని, అందువల్లే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించామని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.