: ఎన్ఎస్జీ వేరు, భారత్ తో స్నేహం వేరు: చైనా


అణు సరఫరా దారుల బృందంలోకి భారత్ రాకను అడ్డుకుంటున్నంత మాత్రాన ఆ దేశంతో స్నేహ, ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం ఉంటుందని తామెన్నడూ భావించబోమని చైనా స్పష్టం చేసింది. ఎన్ఎస్జీ సమావేశాలకు, భారత్, చైనా మిత్రత్వానికి సంబంధం లేదని తెలిపింది. ప్రస్తుతం తాష్కెంట్ లో ఉన్న భారత ప్రధాని, చైనా ప్రధానితో కలిసి చర్చలు జరపడానికి కొద్ది గంటల ముందు చైనా ఈ ప్రకటన వెలువరించడం గమనార్హం. ఎన్ఎస్జీలో చేరేందుకు తమకు మద్దతివ్వాలని ప్రధాని కోరనున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్ఎస్జీలో భారత్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ఇరు దేశాల మధ్యా సంబంధాలకు విఘాతం కలుగబోదని, దక్షిణాసియాలోని రెండు ప్రధాన దేశాలుగా భారత్, చైనాలు అభివృద్ధి పథంలో కలిసి ముందుకు సాగుతాయని చైనా తెలిపింది.

  • Loading...

More Telugu News