: నా తండ్రి రుణం తీర్చుకునే సమయం వచ్చింది: హీరో రాంచరణ్


ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని అనుకుంటారని, ఆ సమయం ఇప్పుడు తనకు వచ్చిందని మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను, మెస్సెజ్ ను రాంచరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘నా ప్రతి పనికి నాన్న ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారు. నాన్న నటించిన చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తండ్రితో నా ప్రొడక్షన్ ప్రారంభమైంది’ అని రాంచరణ్ పేర్కొన్నాడు. కాగా, చిరంజీవి 150వ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News