: ఎవరికీ అందనంత ఎత్తులో కేసీఆర్ ఫిరాయింపుల రికార్డు: కాంగ్రెస్


కేసీఆర్ తన 25 నెలల పాలనలో 47 మంది ఇతర పార్టీల టికెట్లపై గెలిచిన వారిని చేర్చుకుని ఫిరాయింపుల్లో ఎవరికీ అందనంత ఎత్తునకు ఎదిగి రికార్డును సృష్టించారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఫరూఖ్ హుస్సేన్, ఎంఎస్ ప్రభాకర్ లను అనర్హులుగా ప్రకటించాలని మండలి చైర్మన్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. 47 మందిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఈ తరహా ఫిరాయింపులు తెలుగు రాష్ట్రాల్లో తప్ప మరెక్కడా లేవన్నారు. రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి నేతలు ప్రజాస్వామ్యంలో ఉండరాదని తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టుగా ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచితే, తమ పార్టీ పెను పోరాటాన్ని చేస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News