: మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారు... కేసీఆర్ పై మండిపడ్డ పాల్వాయి
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను ఒంటరి చేయాలని కేసీఆర్ సర్కార్ చూస్తోందని, తన మాటల గారడీతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా కాకుండా బూడిద తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. తనకు అనుకూలంగా ఉన్న వారినే విశ్వవిద్యాలయాల ఉప కులపతులుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారని, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరిట కేసీఆర్ కు ముడుపులు బాగానే ముట్టాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేతలు చర్యలు తీసుకోవాలని, అధిష్ఠానం నుంచి తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు అందలేని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.