: మీకు నెలన్నర డెడ్ లైన్... తర్వాత ఇక ఉపేక్షించను!: అధికారులతో చంద్రబాబు
కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న వేళ, ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నా, ఘాట్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పుష్కర పనులపై సమీక్షించిన ఆయన, ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. అన్ని పనులూ నెలన్నర రోజుల్లోగా పూర్తి కావాలని డెడ్ లైన్ విధించారు. సకాలంలో పనులు పూర్తి కాకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కార్పొరేటర్లు తమ తమ పరిధుల్లో జరుగుతున్న పుష్కర పనులను నిత్యమూ పర్యవేక్షిస్తుండాలని, వేగంగా పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లకు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. పుష్కరాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.