: మాయల మరాఠీలనే మించిపోయిన చంద్రబాబు: వైఎస్సార్సీపీ నేత భూమన


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాయల మరాఠీలనే మించిపోయారని, ఆయన్ని చూసి ప్రజలు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బాబుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బాబు సీఎం అయిన తర్వాత చేసిన సంతకాల్లో ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువని, ఎన్ని అబద్ధాలు చెప్పినా నడిచిపోతుందని బాబు అనుకుంటున్నట్లు ఉందని భూమన విమర్శించారు.

  • Loading...

More Telugu News