: సోమా కంపెనీ ప్రతినిధులపై మండిపడ్డ చంద్రబాబు


విజయవాడలో కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్ పనులు దక్కించుకున్న సోమా కంపెనీ ప్రతినిధులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పనుల్లో పురోగతి కనపడడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని అన్నారు. జులై 1న మరోసారి వచ్చి పనులను పరిశీలిస్తానని, పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని సోమా కంపెనీ ప్రతినిధులను చంద్రబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News