: 'వద్దు నాన్నా' అని వేడుకున్నా వినని కర్కోటకుడికి 22 ఏళ్ల జైలుశిక్ష!


కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కోటకుడై బిడ్డ జీవితాన్ని చిదిమేయడమే కాకుండా, ఆన్ లైన్లో తనకు పరిచయమైన వారికి అప్పగించి, వారు అత్యాచారాలు చేస్తుంటే, పక్కనే ఉండి చూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించిన ఓ ఆస్ట్రేలియన్ కామాంధుడికి కోర్టు ఇరవై రెండున్నరేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 2013 నుంచి 2015 మధ్య, తన 11 సంవత్సరాల కుమార్తెపై జరిపిన దారుణాలకు సంబంధించి 61 కేసులు నమోదుకాగా, వాటన్నింటినీ నిందితుడు అంగీకరించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది వెల్లడించారు. తల్లిదండ్రులు విడిపోవడంతో తండ్రి సంరక్షణలో ఉండిపోవడం బాలిక చేసిన పాపమై పోగా, బాలిక గుర్తింపును కాపాడేందుకు అతని పేరును బయటకు వెల్లడించేందుకు పెర్త్ జిల్లా కోర్టు అంగీకరించకపోగా, 42 ఏళ్ల ఈ కామాందుడి దుశ్చర్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలనూ న్యాయమూర్తి పరిశీలించారు. పలు చోట్ల 'వద్దు నాన్నా' అని ఆ బాలిక వేడుకుంటూ ఉండటం చూసిన న్యాయమూర్తి ఫిలిప్ ఈటన్ చలించి పోయారు. ఇంతకన్నా పెద్ద శిక్షే వేయాలనుందని వ్యాఖ్యానించారు. ఇతనితో పాటు బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న డేవిడ్ వోల్మర్ అనే మరో వ్యక్తికి పదేళ్ల జైలు శిక్షను విధించారు.

  • Loading...

More Telugu News