: ఢిల్లీలో ముంబై ఫ్లైటెక్కిన హరీశ్... నేటి సాయంత్రం ‘మహా’ మంత్రితో కీలక భేటీ
కృష్ణా నదీ జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం మొన్న ఢిల్లీ వెళ్లిన తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో నిర్వహించిన భేటీ ఎలాంటి ఫలితాన్నివ్వకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హరీశ్ రావు... తన ఢిల్లీ పర్యటనను ముగించుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాదు ఫ్లైట్ ఎక్కడానికి బదులు ముంబై విమానం ఎక్కేశారు. ఢిల్లీ నుంచి నేరుగా ముంబై బయలుదేరిన హరీశ్ రావు... నేటి సాయంత్రం అక్కడ మహారాష్ట్ర కేబినెట్ లోని కీలక మంత్రితో భేటీ కానున్నారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ పర్యటనకు రానున్నారు. హరీశ్ రావు భేటీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి.