: తుపాకీ గురిపెట్టి దారుణంగా అత్యాచారం... బాధితురాలి పరిస్థితి విషమం


ఢిల్లీలో 2012లో నిర్భయపై జరిగిన ఘోర అత్యాచార ఘటనను తలపించేలా మరో దారుణం బిహార్ లోని మోతిహారిలో చోటు చేసుకుంది. 21 ఏళ్ల యువతిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. తుపాకీని, కట్టె పుల్లలను ఆమె అంతర్గత అవయవాల్లోకి చొప్పించి రాక్షసానందాన్ని అనుభవించారు. తీవ్ర గాయాలతో విషమ పరిస్థితులతో రోడ్డు పక్కన వివస్త్రగా పడి ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత నిందితుల్లో ఒకడైన సమీవుల్లా లోగడ ఇదే యువతిని లైంగికంగా వేధించి ఓ వీడియో తీశాడు. దాన్ని చూపించి ఆమెను లొంగదీసుకునేందుకు అతడితోపాటు మరికొందరు ప్రయత్నించారు. కోపంతో ఆ యువతి అక్కడున్న వారిలో ఓ యువకుడిపై బ్లేడ్ తో దాడి చేయబోయింది. దీంతో ఉన్మాదులు రెచ్చిపోయారు. ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. తనను కొట్టడంతోపాటు తనపై అత్యాచారం చేసినట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మీడియాకు వెల్లడించింది. నిందితుల కుటుంబ సభ్యులు సైతం తనపై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News