: ఏపీది మొండి వైఖరి!... దేవినేని ఉమాపై హరీశ్ ఫైర్!


కృష్ణా నదీ జలాల పంపకంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర జల వనరుల శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన చర్చల్లో ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావులు ఎలాంటి ఉమ్మడి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. సమావేశంలో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు సమసిపోయేందుకు మరింత మేర చర్చలు జరగాల్సి ఉందన్న భావనతో 3-4 నెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్ర జలనవరుల శాఖ ఉన్నతాధికారి అమర్ జిత్ సింగ్ ప్రతిపాదించారు. దీనికి హరీశ్ రావు సరేనన్నా, దేవినేని ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు... దేవినేని వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రతిపాదనకు తాము సరేనన్నా... మొండి వైఖరితో వ్యవహరించిన ఏపీ ఆ ప్రతిపాదనకు ససేమిరా అన్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News