: అమ్మో! డాడీ, అన్నయ్యలతోనా?... చస్తే వెళ్లను: నిహారిక
తన కుటుంబ సభ్యులతో కలసి 'ఒక మనసు' చిత్రాన్ని థియేటర్లో చూసే సమస్యే లేదని హీరోయిన్ నిహారిక వెల్లడించింది. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, నిన్నటి వరకూ సినిమాను 24వ తేదీన చూస్తామని చెబుతూ వచ్చిన అన్నయ్యలంతా, ఇప్పుడు ముందు రోజు ప్రీవ్యూ షో వేయించాలని ప్లాన్ వేశారని చెప్పిన నిహారిక, తన తండ్రి అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఇక అమ్మ, నాన్న, అన్నయ్యలు, కజిన్స్ తో కలసి ఈ సినిమాకు తాను వెళ్లే చాన్సే లేదని చెప్పింది. వారితో వెళితే తనను ఆటపట్టించి, ఏడిపిస్తారని అంటోంది. సినిమాలో ఎక్కువగా చీరల్లోనే కనిపించడాన్ని ప్రస్తావిస్తూ, చీరలు తనకు ఎంతో ఫేవరెట్ అని, వాటిల్లో ఎంతో కంఫర్ట్ ఉంటుందని చెప్పిన నిహారిక, తానేమీ 9వ తరగతి, పదో తరగతి చదువుతున్న చిన్న పిల్లను కాదని, చీరలు తనకు నప్పుతాయని చెప్పుకొచ్చింది.