: 'మెగా' ట్యాగ్ కు రెడీ కాలేదు: నిహారిక
తన పేరు పక్కన 'మెగా' ట్యాగ్ తగిలించుకునేందుకు తానింకా సిద్ధం కాలేదని నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక వ్యాఖ్యానించింది. రేపు తాను నటిస్తున్న చిత్రం 'ఒక మనసు' విడుదల సందర్భంగా ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, ఎంతో కష్టపడితేనే పెదనాన్నకు ఆ ట్యాగ్ లభించిందని, తానూ అంతే స్థాయిలో శ్రమించిన తరువాతనే 'మెగా' ట్యాగ్ తీసుకునేందుకు అర్హత సాధించినట్టు భావిస్తానని చెప్పింది. పరిశ్రమలో తానేంటో నిరూపించుకుంటానని నమ్మకంగా వెల్లడించింది. తనకు ఆ హక్కు వచ్చిందని అనుకున్నప్పుడు తానే విషయాన్ని చెబుతానని అన్నారు. చిరంజీవి కుటుంబంలో పుట్టడం తన అదృష్టమని, మెగా అభిమానులు తనను తెరపై ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆత్రుత నెలకొందని చెప్పింది.