: ‘తెలంగాణ’కు 1500 కోట్లు ఎగవేసిన బిల్డర్లు.. వసూలుకు నడుంబిగించిన ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వానికి బిల్డర్లు ఎగవేసిన 1500 కోట్ల రూపాయలను వసూలు చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు బిల్డర్లు హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్లు ప్రారంభించారు. వాణిజ్య, నివాస ప్రాజెక్టులపై 5 శాతం షేర్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ తర్వాత బిల్డర్లు ఆ విషయాన్ని గాలికొదిలేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగవేశారు. 9 మంది బిల్డర్లే ప్రభుత్వానికి దాదాపు 600 కోట్ల వరకు చెల్లించాల్సింది వుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వెంచర్లు ప్రారంభించేందుకు బిల్డర్లు ఏపీ హౌసింగ్ బోర్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2004 నుంచి 2008 మధ్యలో 19 జాయింట్ వెంచర్లు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటే పూర్తికాగా మిగతావి వివిద దశల్లో ఉన్నాయి. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, వ్యాట్ తదితర రూపాల్లో బిల్డర్లు ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించాల్సి ఉంది. అలాగే ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం రూపంలో ఏపీహెచ్‌బీకి సొమ్ము చెల్లించాల్సి ఉంది. అయితే సంవత్సరాల తరబడి ఈ విషయం పెండింగ్‌లో ఉంది. దీంతో కళ్లు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం బిల్డర్ల నుంచి బకాయి సొమ్మును ఎలా రాబట్టాలన్న విషయంపై ఓ కేబినెట్ సబ్ కమిటీ వేసింది. కమిటీ సూచనల ప్రకారం బకాయి సొమ్మును రాబట్టనుంది.

  • Loading...

More Telugu News