: ఒకరి ఆత్మహత్య మరో ముగ్గురి ప్రాణాలు బలిగొంది


ఓ మహిళ ఆత్మహత్యను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులోని కృష్ణగోర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపం చెందిన రాఖీ ఘోష్ (28)ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గదిలోకి వెళ్లి శరీరంపై కిరోసిన్ గుమ్మరించుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తాళలేని ఆమె బాధతో అరుస్తూ ఇంటి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అది చూసిన ఆమె తల్లి ముక్తి ఘోష్(60), వదిన రాను ఘోష్(42), రాఖీ భర్త నందా ఘోష్(38) ఆమెను రక్షించేందుకు ప్రయత్నించే క్రమంలో మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నందా ఘోష్ అన్న మాత్రం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. రోజుకూలీగా పనిచేసే నందా ఘోష్‌కు మూడున్నరేళ్ల క్రితం రాఖీతో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. కుమారుడి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్తాపం చెందిన రాఖీ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News