: ఏపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది: కాంగ్రెస్ నేతల ఆరోపణ


సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ రోజు వీరు గవర్నర్ నరసింహన్ ను కలసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గుంటూరులోని అమరేశ్వర ఆలయానికి అనుబంధంగా చెన్నయ్ లో ఉన్న 471 ఎకరాల సదావర్తి సత్రం భూములను టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, అక్రమ వేలం ద్వారా ఈ భూములను టీడీపీ నేతలకు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ కు ఒక వినతిపత్రం సమర్పించినట్లు నేతలు పేర్కొన్నారు. ఈ అక్రమ వేలాన్ని రద్దు చేయాలని, రూ.5వేల కోట్ల విలువ చేస్తే ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. దేవుడి భూములను వేలం వేసే అధికారం ప్రభుత్వానికి లేదని, దేవుడి ఆస్తులను రక్షించేందుకు ఏపీ, తమిళనాడులో కోర్టులను ఆశ్రయించి, న్యాయపోరాటం చేస్తామన్నారు. వేలానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఈ వేలం నిర్వహించారని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News