: ఏపీలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు
ఏపీలో 15 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ డీసీపీ-1( లా అండ్ ఆర్డర్)గా కోయ ప్రవీణ్, విజయవాడ డీసీపీ-2 (లా అండ్ ఆర్డర్)గా పాల్ రాజ్, సీఐడీ ఎస్పీగా కేవీ మోహన్ రావు, విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా కాంతిరాణా టాటా, అడ్మిన్ అడిషనల్ ఐజీగా ఎస్.రంగారెడ్డి, విశాఖపట్టణం డీసీపీ( లా అండ్ ఆర్డర్)గా నవీన్ గులాటీ, జైళ్ల శాఖ డీజీగా వినయ్ రంజన్ రాయ్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా హరీశ్ కుమార్ గుప్తా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఐజీగా కేవీవీ గోపాలరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా నాగేంద్రకుమార్, గ్రేహౌండ్స్ కమాండర్ గా గోపీనాథ్ జెట్టీ, 6వ బెటాలియన్ కమాండెంట్ గా సెంథిల్ కుమార్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీలుగా నవదీప్ సింగ్, హరికృష్ణ, తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏఎస్పీగా ఎన్.శ్వేతను బదిలీ చేశారు.