: పాకిస్థాన్ ఖవ్వాలీ గాయకుడి కాల్చివేత
పాకిస్థాన్ లో ప్రముఖ ఖవ్వాలీ గాయకుడు అంజాద్ సబ్రీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈరోజు కరాచీలో ఆయన కారులో వెళ్తుండగా దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పాకిస్థాన్ మీడియా కథనం. కాల్పులు జరిగిన సమయంలో అంజాద్ తో పాటు ఆయన సహాయకుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే వాళ్లిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తరలించేటప్పటికే అంజాద్ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, అంజాద్ సబ్రీ సోదరుడు కూడా సంగీతం నేర్చుకున్నాడు. సబ్రీ సోదరులుగా వారు పేరు పొందారు. సబ్రీ సోదరులు తమ తండ్రి ఇనాయత్ హుస్సేన్ సబ్రీ నుంచి సంగీతం నేర్చుకున్నారు. తండ్రి సాయంతో ఖవ్వాలీ గ్రూప్ ను వారు ఏర్పాటు చేసి పలు ప్రదర్శనలు ఇచ్చారు. 1946లో సబ్రీ కుటుంబం భారత్ నుంచి పాకిస్థాన్ కు వలస వెళ్లింది.