: గూడ అంజయ్య అంత్యక్రియలు పూర్తి
అనారోగ్యంతో నిన్న సాయంత్రం కన్నుమూసిన ప్రజాకవి, రచయిత గూడ అంజయ్య(61) అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం పూర్తయ్యాయి. గూడ అంజయ్య స్వంత గ్రామం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అంజయ్య ఆశయాలను కొనసాగిద్దామంటూ అందరిచేత ప్రజా గాయకుడు గద్దర్ ప్రతిజ్ఞ చేయించారు.