: రేపటి ఆర్టీసీ సమ్మెలో మార్పులేదు: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ
తాము రేపు నిర్వహించతలపెట్టిన సమ్మెలో ఎటువంటి మార్పు ఉండబోదని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత రాజిరెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లను సాధించుకునే క్రమంలో రేపటి సమ్మెలో ఈయూ, ఎన్‌ఎంయూతో పాటు మరో 7 కార్మిక సంఘాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. సమ్మె నిర్వహిస్తామని ప్రకటించిన తమకు సమస్యల పరిష్కారం అంశంపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదని ఆయన అన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం రేపటి సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.