: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు నష్టపోయి 26,766 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 8,204 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్ సంస్థ షేర్లు అత్యధికంగా 2.24 శాతం లాభపడి రూ.207.80 వద్ద ముగిశాయి. వీటితోపాటు డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, లుపిన్, అంబుజా సిమెంట్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన సంస్థల షేర్ల విషయానికొస్తే, భారతీ ఇన్ఫ్రాటెల్ సంస్థ షేర్లు అత్యధికంగా 3.20 శాతం నష్టపోయి రూ.336.85 వద్ద ముగిశాయి. వీటితోపాటు టాటా మోటార్స్ డీవీఆర్, టాటా మోటార్స్, గెయిల్, బాష్ లిమిటెడ్ సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.

  • Loading...

More Telugu News