: మూడో టీ20 మ్యాచ్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే
హరారే వేదికగా ఇండియా-జింబాబ్వే మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. జింబాబ్వే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా ప్రత్యర్థి జట్టుపై టీ20 మ్యాచుల్లో ఒకటి గెలిచి, ఒకటి ఓడిన సంగతి తెలిసిందే. ఈరోజు జరగనున్న మ్యాచులో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. టీమిండియా ఓపెనర్లుగా మందీప్ సింగ్, లోకేష్ రాహుల్ క్రీజులోకి వచ్చారు.