: శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్ గర్ల్: బ్రహ్మానందం కితాబు
ప్రముఖ నటుడు కమలహాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ శ్రుతిహాసన్ తన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అందాల భామతో కలిసి కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన బ్రహ్మానందం ‘విత్ ఏ మల్టీ టాలెంటెడ్ గర్ల్ శ్రుతిహాసన్’ అనే ఒక క్యాప్షన్ కూడా రాశారు. కాగా, కమల్ తాజా చిత్రం ‘శభాష్ రాయుడు’లో శ్రుతిహాసన్, బ్రహ్మానందం నటిస్తున్న విషయం తెలిసిందే.