: గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి: హెచ్చార్సీని ఆశ్రయించిన నిఖిల్ రెడ్డి తండ్రి


నిఖిల్ రెడ్డి ఎత్తు పెంచేందుకు అశాస్త్రీయ పద్ధతిలో ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ అతని తండ్రి హెచ్చార్సీని ఆశ్రయించారు. బీజేపీ నాయకులతో కలిసి హెచ్చార్సీ అధికారులను ఆయన కలిశారు. ఈ ఆపరేషన్ తో నిఖిల్ నరకయాతన పడుతున్నాడని, అందుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, నిఖిల్ రెడ్డి ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. సర్జరీ అనవసరంగా చేశారని, ఇందుకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ పేర్కొనడం విదితమే.

  • Loading...

More Telugu News