: ఒంగోలు చేరుకున్న సీఎం చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నారు. ఏబీఎం చర్చి 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆక్కడ తాగునీటి పథకం పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలోను, మినీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలోను చంద్రబాబు పాల్గొంటారు. రైతులకు రెండో విడత రుణమాఫీ పత్రాలు పంపిణీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News