: చంద్రబాబు సభకు గైర్హాజరయిన పలువురు నేతలు
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో జరుగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు పార్టీకి చెందిన పలువురు నేతలు గైర్హాజరయ్యారు. ఇప్పటికే కుటుంబసమేతంగా నందమూరి హరికృష్ణ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎంపికలో తనపేరు ప్రకటించకపోవడంతో గుర్రుగా ఉన్న దాడి వీరభద్రరావు... బాబు వైఖరిపై వ్యతిరేక బావుటా ఎగురవేశారు. దాంతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న దాడి ఈ సభకు హాజరు కాలేదని తెలుస్తోంది. మరోనేత కడియం శ్రీహరి కూడా విశాఖ ముగింపు సభకు రాలేదు. ఈయన కూడా పార్టీలో నెలకొన్న పరిణామాల పట్ల మనస్తాపంతో ఉన్నారని, అందుకే సభకు గైర్హాజరయ్యారని సమాచారం.