: కాపులను బీసీల్లో కలపడం ముద్రగడకు ఇష్టం లేదు: చినరాజప్ప
కాపులను బీసీల్లో కలపడం ముద్రగడ పద్మనాభంకు ఇష్టం లేదని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ డిమాండ్ చేయకముందే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేరుస్తామని సీఎం చంద్రబాబు నాడు హామీ ఇచ్చారన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశానికి సంబంధించి మంజునాథ కమిటీ నివేదిక వచ్చేంత వరకు కూడా ముద్రగడ ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఈ విషయమై ముద్రగడ కొంచెం ఓపికపడితే బాగుంటుందని చినరాజప్ప సూచించారు.