: అధికారులను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతృత్వ పోకడలకు పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన మాట వింటేనే అధికారులు మనగలుగుతారన్న రీతిలో సీఎం తీరు ఉందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అన్ని వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకోవాలని చూసే టీడీపీ నేతల ధోరణితో ఏపీ నష్టపోయే పరిస్థితి వస్తోందని ఆమె అన్నారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులని ప్రభుత్వ నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో అఫిషియల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.