: ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడితే బాగుండదు: రాజకీయాలపై లగడపాటి
ప్రస్తుత రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, వాటిపై తాను ఇప్పుడు మాట్లాడితే బాగుండదని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన స్కోడా కారు రిజిస్ట్రేషన్ పనిమీద హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఈరోజు లగడపాటి వచ్చారు. అనంతరం ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రవాణాశాఖ కమిషనర్లను కలిశారు. పలు అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా లగడపాటి వద్దకు మీడియా మిత్రులు వెళ్లి ప్రస్తుత రాజకీయాంశాలపై మాట్లాడాలని కోరారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్న నేను వాటిపై మాట్లాడబోనం’టూ ఆయన నిరాకరించారు.