: ఆర్టీసీని బతికించుకునేందుకు కార్యాచరణ ప్రభుత్వం వైపు నుంచి రావాలి: కోదండరాం
ఆర్టీసీని బతికించుకునేందుకు కార్యాచరణ ప్రభుత్వం వైపు నుంచి రావాలని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు మేధోమథన సదస్సు జరిగింది. సదస్సులో ఆర్టీసీ నష్టాలు, సమ్మె సన్నాహాలు అంశంపై చర్చించారు. ఈ సదస్సుకు కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కార్యాచరణ అవసరమని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వానికి చెల్లిస్తోన్న పన్నులపైనా స్థూలంగా తెలియజేయాలని ఆయన సూచించారు. చట్టబద్ధంగా ఆర్టీసీ విభజనను త్వరగా చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. రవాణ వ్యవస్థలో కార్పొరేట్ రంగాన్ని నిలువరించడం అత్యవసరమని ఆయన అన్నారు. ప్రైవేటు ఆపరేటర్ల నియంత్రణకు ప్రభుత్వ కార్యాచరణను కార్మికులు సూటిగా అడగాలని ఆయన సూచించారు. సదస్సుకు ఈయూ, ఎస్డబ్యూఎఫ్ సహా ఏడు సంఘాల నేతలు హాజరయ్యారు.