: బీరు అమ్మకాలు తగ్గించండి... లిక్కర్ అమ్మకాలు పెంచండి!: ఆదాయం పెంపుకు కర్ణాటక ఆదేశాలు!


కర్ణాటక ఆదాయంలో ఆ రాష్ట్ర ఆబ్కారీ శాఖ వాటానే ఎక్కువ. ఒక్క కర్ణాటకే కాదు... మిగిలిన అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. మరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మద్యం విక్రయాలను మరింత పెంచాలి. ఓ పక్క రాబడి లేకున్నా ఫరవా లేదు, జనం ఆరోగ్య పరిరక్షణే ముఖ్యమంటూ బీహార్, కేరళ తదితర రాష్ట్రాలు ముందుకు సాగుతుంటే... కర్ణాటక అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలపై దృష్టి సారించిన సిద్ధరామయ్య సర్కారు... రాష్ట్రంలో బీరు విక్రయాలను బాగా తగ్గించేందుకు నడుం బిగించింది. అదే సమయంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వినియోగం పెరిగే విధంగా ఆ రాష్ట్రం ప్రత్యేక వ్యూహాన్ని రచించింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు సర్కారు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. బార్లకొచ్చే మద్యం ప్రియులకు బీర్లు లేవని చెప్పి, లిక్కర్ ను కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. అంటే రానున్న కాలంలో కర్ణాటక బార్లలో బీర్లు కనిపించవన్న మాట.

  • Loading...

More Telugu News