: జేఎన్ యూనివర్శిటీకి నేతాజీ పేరు పెట్టాలట!... సుబ్రహ్మణ్యస్వామి సరికొత్త డిమాండ్!


బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సరికొత్త డిమాండ్ వినిపించారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో ఇటీవల ఢిల్లీలోని జవహల్ లాల్ నెహ్రూ వర్సిటీ వార్తల్లోకి ఎక్కింది. సాక్షాత్తు పార్లమెంటుపైనే దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ వర్సిటీలో ర్యాలీ జరగడం, అందులో జాతి వ్యతిరేక నినాదాలు హోరెత్తడం దేశాన్ని కుదిపేసింది. వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. అయితే పలు ఆసక్తికర పరిణామాల అనంతరం వర్సిటీలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ క్రమంలో వర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీకి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని వర్సీటీ తీర్మానించింది. వర్సిటీ నిర్ణయాన్ని స్వాగతించిన సుబ్రహ్మణ్య స్వామి... వర్సిటీ పేరును కూడా ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం’గా మార్చాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక విప్లవంలో భాగంగా వర్సిటీ పేరును మార్చేయాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News