: ఎదురుగా కూర్చున్న కుంబ్లే, స్కైప్ ద్వారా బదులిచ్చిన శాస్త్రి!
భారత క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్ గా ఎవరు ఉండాలన్న విషయమై దిగ్గజ త్రయం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు జరిపిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. మొత్తం 20 మందికి పైగా అభ్యర్థులను వీరు ప్రశ్నించారు. భారత జట్టు మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, రవి శాస్త్రిలు వరుసలో ముందున్నట్టు తెలుస్తోంది. ఇక ఇంటర్వ్యూకు అనిల్ కుంబ్లే స్వయంగా వచ్చి ఒకప్పటి తన సహచరులు, ఇప్పటి ఇంటర్వ్యూ పెద్దల ముందు కూర్చుని వారడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పాడు. ఇక రవిశాస్త్రి, స్వయంగా రాలేదు. ఆయన థాయ్ ల్యాండ్ నుంచి సామాజిక మాధ్యమం స్కైప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక భారత కోచ్ గా దాదాపు కుంబ్లే ఖరారు కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతుండగా, నేడు నియామకపు ప్రకటన వెలువడనుంది.