: ఫీజుల దందాపై ఆందోళ‌న‌.. విద్యాశాఖ డైరెక్ట‌రేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు టీఎన్ఎస్ఎఫ్ ప్రయత్నం


ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దందాను నియంత్రించాలంటూ హైదరాబాద్‌లోని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్‌) కార్య‌క‌ర్త‌లు ఈరోజు ఆందోళ‌న‌కు దిగారు. డైరెక్ట‌రేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠ‌శాల‌లు అధిక మొత్తంలో ఫీజులు నిర్దేశిస్తూ, విద్యార్థుల త‌ల్లిదండ్రుల ముక్కుపిండి మరీ వ‌సూలు చేస్తున్నాయ‌ని టీఎన్ఎస్ఎఫ్ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఫీ‘జులుం’పై ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆందోళ‌న‌కు దిగిన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News