: రైల్వేలో వెయిటింగ్ లిస్టుకు మంగళం... 1 నుంచి ఖాళీ ఉంటేనే రిజర్వేషన్
లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు శుభవార్త. జూలై 1 నుంచి రైల్వేల్లో వెయిటింగ్ లిస్టు కష్టాలిక ఉండవు. రైళ్లలో ఖాళీ ఉంటేనే రిజర్వేషన్ టికెట్లు లభిస్తాయి. బెర్త్ ఖరారు లేదా కనీసం ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగనెస్ట్ క్యాన్సిలేషన్) ఖాళీ ఉంటేనే రిజర్వేషన్లు ఇచ్చేలా రైల్వే శాఖ నిబంధనలు మార్చింది. ఆపై తత్కాల్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే 50 శాతం రిఫండ్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. తత్కాల్ టికెట్ల సమయాలను మార్చుతూ, ఏసీ కోచ్ లకు ఉదయం 10 గంటల నుంచి, స్లీపర్ కోచ్ లకు ఉదయం 11 గంటల నుంచి టికెట్ల జారీ మొదలవుతుందని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని, శతాబ్ది రైళ్ల సంఖ్యను పెంచుతామని, పలు భాషల్లో టికెట్లను ముద్రిస్తామని కూడా రైల్వే శాఖ ప్రకటించింది.