: బీహార్‌ని వణికించిన పిడుగుల వర్షం.. 46 మంది మృతి
బీహార్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తమయింది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలతో అక్కడి అనేక ప్రాంతాలు తల్లడిల్లుతున్నాయి. భయం గుప్పిట్లో ప్రజలు వణికిపోతున్నారు. పిడుగు పాటుకి ఇప్పటివరకు బీహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 46మంది దుర్మరణం పాలయ్యారు. రుతుపవనాలు బలపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పోటెత్తుతోన్న వరదలతో బీహార్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.