: తెలుగు రాష్ట్రాల సిగపట్లు!... హస్తినలో కృష్ణా బోర్డు రెండో రోజు భేటీ!


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య జల వివాదాలు మరింత ముదిరినట్లే కనిపిస్తున్నాయి. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా ఏపీలోని రాయలసీమ ఎడారిగా మారిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేసిన ఏపీ సర్కారు... ప్రాజెక్టులను ఆపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు వచ్చాయని చెబుతున్న తెలంగాణ సర్కారు... ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు రాష్ట్రాలు కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో జరిగిన బోర్డు భేటీకి ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలోనూ ఇరు వర్గాలు తమ తమ వాదనలనే వినిపించి ఏమాత్రం సామరస్యపూర్వక ధోరణిని ప్రదర్శించలేదు. దీంతో వరుసగా రెండో రోజు కూడా భేటీ కావాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో వరుసగా రెండో రోజు ప్రారంభమైన ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలకు సిద్ధమైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News