: జలంధర్ లో సెలబ్రిటీ షూటింగ్!... పెళ్లి వేడుకలో పేలిన గన్, ప్రాణాపాయ స్థితిలో యువకుడు


పెళ్లి వేడుకల్లో తుపాకుల మోత మారు మోగుతోంది. సంబరాల పేరిట గాల్లోకి తుపాకులను పేలుస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... తాజాగా పంజాబ్ లోని జలంధర్ లో చోటుచేసుకున్న ఈ తరహా ఘటనలోనే ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. జలంధర్ లో ఇటీవల జరిగిన సంబరాల్లో భాగంగా ఓ యువకుడు తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. సదరు తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ గురి తప్పి పెళ్లి కొడుకు భుజాన్ని రాసుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత అదే బుల్లెట్ సంబరాల్లో భాగంగా జోరుగా చిందులేస్తున్న ఓ యువకుడి తలలోకి దూసుకెళ్లింది. దీంతో అతడు ఉన్న చోటే కుప్పకూలాడు. బుల్లెట్ శబ్దం, వెనువెంటనే యువకుడు కుప్పకూలడంతో సంబరాలు కాస్తా విషాదంగా మారాయి. వెంటనే స్పందించిన అక్కడి వారు బుల్లెట్ కారణంగా స్వల్పంగా గాయాలైన పెళ్లి కొడుకుతో పాటు రక్తపు మడుగులో పడిపోయిన యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

  • Loading...

More Telugu News