: క్రీడారంగంలో రాజకీయాలు ఉండకూడదు: మంత్రి జగదీశ్వర్ రెడ్డి
క్రీడారంగంలో రాజకీయాలు ఉండకూడదని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నియోజక వర్గంలోనూ ఓ స్టేడియం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు రాణిస్తే దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. క్రీడాకారుల ఎంపిక విషయంలో రాజకీయాలు చేయకపోతే ప్రతిభగల క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందించినట్లవుతుందని పేర్కొన్నారు.