: జగన్ కేసు నుంచి ఒక్కొక్కరికీ విముక్తి... పునీత్ దాల్మియా పైనా విచారణ నిలిపివేత


జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు, ఇండస్ట్రియలిస్టులు బయటపడగా, తాజాగా దాల్మియా సిమెంట్స్ యజమాని పునీత్ దాల్మియాకు కూడా విముక్తి లభించింది. సున్నపురాయి గనులకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టుకు వెళ్లిన పునీత్, తనకేమీ సంబంధం లేదని వాదించారు. దాల్మియాపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని అభిప్రాయపడ్డ హైకోర్టు, ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. కాగా, కడప జిల్లాలో జయా మినరల్స్ కంపెనీకి కేటాయించిన సున్నపు రాయి గనుల తవ్వక అనుమతులను, తొలుత సజ్జల దివాకర్ రెడ్డి కంపెనీకి, ఆపై దాల్మియాకు బదిలీ చేశారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. అందువల్లే జగన్ సంస్థల్లో పునీత్ దాల్మియా భారీ పెట్టుబడులు పెట్టారని సీబీఐ అభియోగాలు మోపింది.

  • Loading...

More Telugu News