: చరిత్ర సృష్టించిన ఇస్రో!... పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగం సక్సెస్!


భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుంచి ఇస్రో కొద్దిసేపటి క్రితం లాంచ్ చేసిన పీఎస్ఎల్వీ సీ-34 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మొత్తం 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి తీసుకెళ్లిన ఈ రాకెట్ వాటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశలుగా శాస్త్రవేత్తలు నిర్దేశించిన ప్రయాణాన్ని పీఎస్ఎల్వీ సీ-34 పూర్తి చేసుకుంది. ఈ రాకెట్ తీసుకెళుతున్న 20 ఉపగ్రహాల్లో మూడు మాత్రమే దేశానికి చెందినవి. మిగిలిన 17 కూడా విదేశాలకు చెందిన ఉపగ్రహాలే. ఇప్పటిదాకా 20కి పైగా ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపిన దేశాలుగా అమెరికా, రష్యాలు రికార్డులు నమోదు చేస్తే... తాజా ప్రయోగంతో భారత్ అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి తీసుకెళ్లిన మూడో దేశంగా చరిత్ర సృష్టించింది. తొలుత స్వదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ-34... ఆ తర్వాత విడతలవారీగా విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

  • Loading...

More Telugu News