: రైల్వే బడ్జెట్ కు చెల్లు చీటి!... బ్రిటిష్ సంప్రదాయం ఇంకెందుకంటూ నీతి ఆయోగ్ నివేదిక!


దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ పాలనలో సంస్కరణలకు తెర తీశారు. అప్పటిదాకా కీలక విభాగంగా ఉన్న ప్రణాళికా సంఘానికి చెల్లు చీటి ఇచ్చిన మోదీ సర్కారు. దాని స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేసింది. పాలనపైనే కాకుండా... సంస్కరణలపైనా దృష్టి సారించిన నీతి ఆయోగ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి ఓ నివేదికను అందజేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కేంద్రం అమలు చేసేందుకు నిర్ణయిస్తే... ఇకపై మనం రైల్వే బడ్జెట్ ను చూడలేం. బ్రిటిష్ పాలకుల నుంచి సంక్రమించిన రైల్వే బడ్జెట్ మనకెందుకంటూ ఆ నివేదిక ప్రభుత్వానికి సూచించిందట. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేసే దిశగా ఏమేం చర్యలు చేపట్టాలన్న మోదీ సర్కారు ఆదేశాలతో అధ్యయనం చేసిన దేబ్రాయ్ కమిటీ పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా రైల్వే బడ్జెట్ కు చెల్లు చీటి ఇవ్వడమే మంచిదని కూడా ఆ నివేదిక ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

  • Loading...

More Telugu News