: వైసీపీలో కుల పోరు ఉందట!... పార్టీకి రాజీనామా చేసిన బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురవాచారి!


ఏపీలో విపక్షం వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. తాజాగా ఆ వైసీపీ అనుబంధ విభాగాల నేతలు కూడా టీడీపీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నిన్న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురవాచారి టీడీపీలో చేరిపోయారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో గురవాచారి సైకిలెక్కేశారు. ఈ సందర్భంగా గురవాచారి వైసీపీ సంస్కృతిపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కుల పోరు తారస్థాయిలో ఉందని చెప్పిన ఆయన... పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు సరైన స్థానం లేదన్నారు. సరిగా ఆంగ్లం రాని తనతో పార్టీ తరఫున హైకోర్టులో కేసులు వేయించారని కూడా ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News